నిన్నటి వరకు ఐశ్వర్య.. ఇప్పుడు సోనాక్షి కూడా

Sonakshi Sinha Sharing Screen With Mega Star 151 Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sonakshi Sinha Sharing Screen With Mega Star 151 Movie

మెగాస్టార్‌ చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మించనున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు. లాంచనంగా వచ్చే నెలలో ప్రారంభించి వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లుగా దర్శకుడు సురేందర్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సమయంలోనే హీరోయిన్స్‌ గురించిన చర్చ మరోసారి వస్తుంది. ఇప్పటికే ఐశ్వర్యరాయ్‌ ఒక హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ చిరు 151లో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుందని, చిరంజీవితో ఆమె రొమాన్స్‌కు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఐశ్వర్యరాయ్‌తో పాటు ఈమెను తీసుకున్నారా లేక ఐశ్వర్య రాయ్‌ ప్లేస్‌లో సోనాక్షిని తీసుకున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇద్దరు మద్దుగుమ్మలు కూడా చిరుతో నటిస్తే ఉయ్యాలవాడ స్థాయి అమాంతం పెరిగడం ఖాయం. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్రస్తుతం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నాడు. ఈనెల చివర్లో సినిమాలో నటించబోతున్న నటీనటుల వివరాలను వెళ్లడి చేసే అవకాశం ఉంది. చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రం వంద కోట్లకు పైగా షేర్‌ను రాబట్టిన నేపథ్యంలో 125 కోట్ల బడ్జెట్‌తో ఉయ్యాలవాడ సినిమాను నిర్మించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

‘స్పైడర్‌’లో సితార ఉందా?

ఎన్టీఆర్‌తో చేసేందుకు తాను సిద్దం