‘స్పైడర్‌’లో సితార ఉందా?

Mahesh Babu's daughter Sitara Act In Spyder Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mahesh Babu’s daughter Sitara Act In Spyder Movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం ‘స్పైడర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో గత సంవత్సర కాలంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాను మహేష్‌బాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో మహేష్‌బాబు కూతురు సితార కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా స్పైడర్‌ చిత్ర సెట్స్‌లో సితార తెగ సందడి చేస్తుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నదాని ప్రకారం మూడు రోజుల పాటు సితార షూటింగ్‌లో పాల్గొందని చెబుతున్నారు. అతి కొద్ది మంది టెక్నీషియన్స్‌ మద్య సితారపై సీన్స్‌ను చిత్రీకరించినట్లుగా వారు చెబుతున్నారు. మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు సితారల కాంబినేషన్‌లో సీన్స్‌ ఉంటాయని, అయితే అవి సినిమాలో ఎలా భాగంగా కనిపిస్తాయి అనేది మాత్రం క్లారిటీగా రావాల్సి ఉంది. మురుగదాస్‌ వంటి స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో సితారను పరిచయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మహేష్‌బాబు ఈ చిత్రంలో సితారతో చిన్న రోల్‌ను చేయించినట్లుగా తెలుస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘1’ చిత్రంలో మహేష్‌బాబు తనయుడు గౌతం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

నాని సినిమాపై కేటీఆర్‌ కామెంట్స్‌

ఎన్టీఆర్‌ ఒక స్క్రిప్ట్‌ దొంగ : పూరి