ఎట్టకేలకు ముగించిన సూపర్‌స్టార్‌

Murugadoss Completed Mahesh babu Spyder Movie Shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా మురుగదాస్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. దాదాపు సంవత్సరం క్రితం షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఎట్టకేలకు షూటింగ్‌ను పూర్తి చేశారు. మిగిలి ఉన్న ఆఖరి పాట చిత్రీకరణను విదేశాల్లో ముగించుకున్నారు.

ఆ పాట చిత్రీకరణతో స్పైడర్‌ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది. చిన్న సైజు బాహుబలి స్థాయిలో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. సంవత్సరంకు పైగా చిత్రీకరణ అంటే మామూలు విషయం కాదు.భారీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో పాటు, తెలుగు మరియు తమిళంలో ప్రతి సీన్‌ను చేసిన కారణంగా ఇంత ఆలస్యం అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సినిమాను నాలుగు నెలల క్రితమే విడుదల చేయాలని భావించారు.కాని అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తి కాలేదు.

Image result for Murugadoss Completed Mahesh Babu Spyder Movie Shooting

ఆ కారణంగా సినిమాను సెప్టెంబర్‌ నెలలో దసరా కానుకగా విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో తమిళ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ జే సూర్య విలన్‌ పాత్ర పోషించాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. మహేష్‌ బాబు ఈ సినిమాలో మునుపటి కంటే అందంగా కనిపిస్తున్నాడని, మురుగదాస్‌ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటాడని, ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు:

అర్జున్‌ రెడ్డికి వర్మ వింత సలహ

పైసా వసూల్ ప్రివ్యూ