రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నా..

Will Kamal Haasan enter politics now

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇన్నాళ్లూ ట్విట్ట‌ర్ వేదిక‌గా  పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ…త‌న రాజ‌కీయరంగ  ప్ర‌వేశం గురించి మాత్రం స్ప‌ష్టత ఇవ్వ‌ని క‌మల్ హాస‌న్ తొలిసారి త‌న మ‌న‌సులో మాట చెప్పారు. ఓ అభిమాని వివాహానికి హాజ‌రైన క‌మల్ అక్క‌డ‌కు వ‌చ్చిన త‌న అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాజ‌కీయ ప్ర‌వేశంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. అవినీతిపై పోరాడేందుకు తాను నిర్ణ‌యించుకున్నాన‌ని, త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని క‌మల్ స్ప‌ష్టంచేశారు. మెరుగైన స‌మాజ నిర్మాణ‌మే త‌న లక్ష్య‌మ‌ని, ఈ దిశ‌గా త‌న‌తో క‌లిసి న‌డిచేందుకు యువ‌త ముందుకు రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఓటును అమ్ముకుంటే ప్ర‌శ్నించే హ‌క్కును కోల్పోతామ‌ని, ఎవ్వ‌రూ డ‌బ్బు తీసుకుని ఓట్లు వేయ‌రాద‌ని ఆయ‌న కోరారు. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ప్ర‌వేశంపై కొ్న్నిరోజులుగా త‌మిళ మీడియాతో పాటు జాతీయ స్థాయిలోనూ వార్త‌లొస్తున్నాయి. ర‌జ‌నీకాంత్ దీనిపై ఎప్పుడూ బ‌హిరంగంగా స్పందించ‌లేదు. త‌మిళ‌నాడు పార్టీల‌ను కానీ…ఏ ఇత‌ర పార్టీల‌ను కానీ విమ‌ర్శిస్తూనో, ప్ర‌శంసిస్తోనో ఎలాంటి వ్యాఖ్య‌లూ ర‌జ‌నీకాంత్ చేయ‌లేదు. కానీ క‌మ‌ల్ హాస‌న్ మాత్రం ఇటీవ‌ల ట్విట్ట‌ర్ లో రాజకీయాల గురించి మాత్ర‌మే మాట్లాడుతున్నారు. కొ్న్నిరోజుల క్రితం త‌మిళ‌నాడు అధికార  అన్నాడీఎంకె, ప్ర‌తిప‌క్ష డీఎంకెలను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం సృష్టించాయి. డీఎంకె, అన్నాడీఎంకె రెండు మొద్దుబారిపోయిన ప‌రిక‌రాల‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దీంతో ఆ రెండు పార్టీల్లో దేంట్లోనూ ఆయ‌న చేరే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్ట‌మ‌యింది. మ‌రి రాజ‌కీయాల‌ను స‌మూలంగా మార్చాల‌ని కోరుకుంటున్న క‌మ‌ల్ కొత్త పార్టీ పెడ‌తారా లేక‌…మ‌రేదన్నా పార్టీలో చేర‌తారా అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు:

కుడిభుజాన్ని తెగ్గోసిన పవన్ కళ్యాణ్ ?

గులాబీ పాత కాపులు రగిలిపోతున్నారు

 అమిత్ షా తో మేకపాటి భేటీ…జగన్ కి మరో షాక్ ?