నాని సినిమాపై కేటీఆర్‌ కామెంట్స్‌

Telangana State IT Minister KTR Comments On Nani Ninnu Kori Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Telangana State IT Minister KTR Comments On Nani Ninnu Kori Movie

యువ హీరో నాని వరుసగా సూపర్‌ హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆరు సక్సెస్‌లను అందుకున్న నాని తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను అందుకున్న హీరోగా నాని రికార్డును దక్కించుకున్నాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ‘నిన్ను కోరి’ చిత్రం మంచి కలెక్షన్స్‌ను సాధించింది. దానికి తోడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తాజాగా ఈ సినిమాను చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ కూడా పాజిటివ్‌గా స్పందించడం సినిమాకు మరింత ప్లస్‌ అయ్యింది.

గత వీకెండ్‌లో నాని ‘నిన్ను కోరి’ చిత్రాన్ని కేటీఆర్‌ చూశారట. కేటీఆర్‌ స్వయంగా ట్విట్టర్‌లో ‘నిన్ను కోరి’ చిత్రం బాగుంది అంటూ ట్వీట్‌ చేయడంతో పాటు, నాని నటన అద్బుతంగా ఉందని కితాబు ఇచ్చాడు. నాని నటన గురించి సినీ ప్రముఖులతో పాటు ఇలా రాజకీయ నాయకులు కూడా ప్రశంసించడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. ఇప్పటికే సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రాబోతున్నందంతా కూడా లాభాలే అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే నిన్ను కోరి చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. నాని వరుసగా సక్సెస్‌లు దక్కించుకోవడంతో స్టార్‌ హీరోల సరసన నిల్చున్నాడు.

మరిన్ని వార్తలు: