నో పాలిటిక్స్‌

amala speaks about nagarjuna political entry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా తారలు రాజకీయల్లోకి అడుగు పెట్టడం సర్వ సాదారణం. అదే క్రమంలో నాగార్జున కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. సినిమా కెరీర్‌కు స్వస్థి పలికి వైకాపాలో జాయిన్‌ అయ్యి పార్లమెంటుకు వెళ్లాలి అన్నది నాగార్జున ప్లాన్‌గా ప్రచారం జరిగింది. వైకాపా నుండి కూడా జగన్‌ ఇప్పటికే నాగార్జునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని, గుంటూరు పార్లమెంటు టికెట్‌ నాగార్జునకు ఖాయం అన్నట్లుగా వార్తాలు వచ్చాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది. 

నాగార్జున రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారు అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన భార్య అమల తేల్చి చెప్పారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని, మీడియాలో వస్తున్న వార్తలు ఆశ్చర్యంను కలిగిస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తలు అభిమాను నమ్మి గందరగోళంకు గురి కావద్దని ఆమె సూచించారు. నాగార్జున రాజకీయాలపై అమల స్పందించడంతో ఇన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. వచ్చే నెలలో నాగార్జున ‘రాజు గారి గది 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ తర్వాత విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు నాగార్జున కమిట్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్‌ రెండవ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

మరిన్ని వార్తాలు