శ్రీదేవికి క్షమాపణ చెప్పిన జక్కన్న

Director S S Rajamouli Says Sorry To Sree Devi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో రాజమౌళి, శ్రీదేవిల విషయం హాట్‌ టాపిక్‌ అవుతుంది. శ్రీదేవి పారితోషికంను భరించడం తమ వల్ల కాకపోవడం వల్లే శివగామి పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. అదే సమయంలో శ్రీదేవి నటించక పోవడం మా అదృష్టంగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారంను రేపాయి. దాంతో శ్రీదేవి కూడా కాస్త గట్టిగానే ఆ సినిమా వదిలేయడం తనకేం బాద లేదని, ఇప్పటి వరకు తాను వదిలేసిన వందల సినిమాల్లో అదోటి అంటూ తేలికగా చెప్పేసింది. 

రాజమౌళి అప్పుడు చేసిన వ్యాఖ్యల కారణంగా శ్రీదేవి ఎన్నో మీడియా సమావేశాల్లో బాహుబలిని వదిలేసినందుకు మీకు బాధగా లేదా అనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా శ్రీదేవి నటించిన ‘మామ్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో కూడా బాహుబలి ప్రశ్న అడుగుతుండటం ఆమెకు చిరాకు తెప్పించింది. దాంతో చేసేది లేక అలా అసహనంతో వ్యాఖ్యలు చేసింది. అయితే శ్రీదేవి గురించి తాను అలా మాట్లాడి ఉండకూడదు అని తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమె ఒక గొప్పనటి అని ఆమె మా సినిమాలో నటించక పోవడం మా అదృష్టం అనడం పట్ల పశ్చాతాపం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు