జనసేన ప్రస్థావన తెచ్చినందుకు కమెడియన్‌పై పవన్‌ సీరియస్‌

Pawan Kalyan Angry With Another Comedian

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan Kalyan Angry With Another Comedian

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌ సందర్బంగా ఒక కమెడియన్‌పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యాడు అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. షకలక శంకర్‌ కాస్త అతి చేయడంతో పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విషయం నిజమే అంటూ ఆ కమెడియన్‌ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. అయితే ఆ వార్నింగ్‌ను తాను పవన్‌పై గౌరవంతో తీసుకున్నాను అని, అప్పటి నుండి మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నాను అని చెప్పాడు. ఇక ప్రస్తుతం పవన్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ సందర్బంగా కూడా ఒక కమెడియన్‌పై సీరియస్‌ అయినట్లుగా తెలుస్తోంది.

‘అఆ’ చిత్రంలో ఒక కమెడియన్‌ ప్రముఖ పాత్ర పోషించాడు. ఆ కమెడియన్‌ను తాజాగా ఈ చిత్రంలో కూడా త్రివిక్రమ్‌ కొనసాగిస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌కు సదరు కమెడియన్‌కు కొన్ని సీన్స్‌ ఉన్నాయట. ఆ సీన్స్‌ చిత్రీకరిస్తున్న సమయంలో షూటింగ్‌ గ్యాప్‌లో పదే పదే జనసేన గురించి మాట్లాడటం, రాజకీయాల గురించి చర్చించడం ఆ కమెడియన్‌ చేస్తున్నాడట. దాంతో చిరాకు పుట్టి సదరు కమెడియన్‌పై పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాల్లో ఉన్న సమయంలో రాజకీయాల గురించి పవన్‌ పెద్దగా మాట్లాడడు. కాని సదరు కమెడియన్‌ మాత్రం పదే పదే చర్చించడంతో అసహనంతో అలా చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

శ్రీదేవికి క్షమాపణ చెప్పిన జక్కన్న