ఉయ్యాలవాడ డేట్‌ కన్ఫర్మ్‌

Date fixed for Uyyalavada Narasimha Reddy Movie Shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Date fixed for Uyyalavada Narasimha Reddy Movie Shooting

మెగా ఫ్యాన్స్‌ చిరంజీవి 151వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి చాలా సంవత్సరాల గ్యాప్‌ తీసుకుని చేసిన సినిమా ‘ఖైదీ నెం.150’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో చిరంజీవి మళ్లీ ఫాంలోకి వచ్చాడు. దాంతో చిరంజీవి నుండి ఇంకా అలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చూడాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఇక చిరంజీవి 151వ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. దాదాపు నాలుగు నెలల క్రితమే ఈ విషయం అధికారికంగా తేలిపోయింది. అయితే సినిమా సినిమా ప్రారంభంకు ఆగస్టును ఖరారు చేశారు.

ఎట్టకేలకు చిరంజీవి సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాల గురించి అప్‌డేట్‌ మెగా వర్గాల నుండి వచ్చింది. మెగా ఫ్యామిలీ నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు 15న ఉయ్యాలవాడ సినిమా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నారు. ఉయ్యాలవాడ స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఇలా ఫిక్స్‌ అయ్యారు. ఇప్పటికే సురేందర్‌ రెడ్డి మొత్తం స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేశారు. పరుచూరి బ్రదర్స్‌ కలం నుండి సినిమా కోసం కొన్ని అద్బుతమైన డైలాగ్స్‌ జాలువారినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్స్‌ విషయంలో ఒక ఫైనల్‌ నిర్ణయం రావాల్సి ఉంది. పలువురి పేర్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎంపిక అయిన వారు ఎవరు అనే విషయం చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటిస్తే కాని తెలియదు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

బిగ్‌బాస్‌ కోసం సంపూ, ముమైత్‌ జంటగా..!

‘రంగస్థలం’ సంక్రాంతికి కాదా?