పిక్‌టాక్‌ : లంగాఓణీలో సమంత

Samantha New Look In Half Saree

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Samantha New Look In Half Saree

నిన్న మొన్నటి వరకు చాలా హాట్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపించి విమర్శల పాలు అయిన సమంత ఒక్కసారిగా ట్రెండీ అయ్యింది. ఇటీవల ఒక మ్యాగజైన్‌ కవర్‌ కోసం అత్యంత హాట్‌గా, గతంలో ఎప్పుడు కనిపించనంత దారుణంగా ఫొటో షూట్‌ ఇచ్చింది. ఆ ఫొటో షూట్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్కినేనివారి ఇంటి కోడలు కాబోతున్న అమ్మాయి ఇలా వ్యవహరించడం ఏంటి అంటూ విమర్శలు గుప్పించారు. వాటన్నింటిని పెద్దగా పట్టించుకోని సమంత తాజాగా ఈ ఫొటోను వదిలింది. ఒక తమిళ సినిమా కోసం ఇలా లంగా ఓణిలో కనిపించింది.

సమంత అభిమాని ఒకరు ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, సమంత దాన్ని రీ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నిన్న మొన్న హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హీట్‌ పుట్టించిన సమంత ఇప్పుడు ఈ ఫొటోతో క్యూట్‌గా ఉందనిపించుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ‘రంగస్థలం’ అనే చిత్రాన్ని చేస్తుంది. ఆ సినిమాలో కూడా చాలా ట్రెండీగా చీరలు, లంగాఓణిల్లోనో సమంత కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి లీక్‌ అయిన కొన్ని స్టిల్స్‌ను చూస్తుంటే సమంత పక్క పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

ఉయ్యాలవాడ డేట్‌ కన్ఫర్మ్‌

బిగ్‌బాస్‌ కోసం సంపూ, ముమైత్‌ జంటగా..!