బిగ్‌బాస్‌ కోసం సంపూ, ముమైత్‌ జంటగా..!

Sampoornesh Babu and Mumait Khan Are anchoring In NTR's Big Boss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Sampoornesh Babu  and Mumait Khan Are anchoring In NTR’s Big Boss

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బిగ్‌ బాస్‌’ షో మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. భారీ అంచనాలున్న ఈ షోలో ప్రముఖ సెలబ్రెటీలనే ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. 12 మంది సెలబ్రెటీలతో పాటు ఇద్దరు యాంకర్లను కూడా ఈ షో కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఆ యాంకర్లు మరెవ్వరో కాదు బర్నింగ్‌ స్టార్‌గా దూసుకు పోతున్న మరియు ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టిన ముమైత్‌ ఖాన్‌లు.

వారంలో 7 రోజులు ఈ షో ప్రసారం అవుతుంది. వారాంతంలో ఎన్టీఆర్‌ వస్తాడు. మిగిలిన అయిదు రోజుల్లో సంపూర్నేష్‌బాబు మరియు ముమైత్‌ ఖాన్‌లు ఆ 12 మందితో కలిసి ఎంటర్‌టైన్‌ చేస్తారని సమాచారం. అయితే ఇంత ప్రతిష్టాత్మక షోలో వారిద్దరు ఏంటంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సంపూర్నేష్‌బాబు పార్టిసిపెంట్‌గా అయితే పర్వాలేదు కాని ఇలా యాంకరింగ్‌ ఏంటో అంటూ నందమూరి అభిమానులతో పాటు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు అంతా కూడా అవాక్కవుతున్నారు.

మరిన్ని వార్తలు:

అవి చెత్త వార్తలు.. మేమిద్దరం హ్యాపీ

జయ జానకి నాయక టీజర్ తో షాక్.