‘రంగస్థలం’ సంక్రాంతికి కాదా?

ram charan rangasthalam movie release December

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రంగస్థలం 1985’. ఈ చిత్రాన్ని ఆగస్టులోనే విడుదల చేయాలని మొదట భావించారు. అయితే సమ్మర్‌లో షూటింగ్‌ అనుకున్నట్లుగా కొనసాగలేదు. దాంతో చిత్రాన్ని ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు. షూటింగ్‌ హడావుడిగా కాకుండా మెల్లగానే పూర్తి చేసి సంక్రాంతి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్‌ సభ్యులు నిర్ణయించారు. ఆ విషయాన్ని టైటిల్‌ అనౌన్స్‌ చేసిన సమయంలో ప్రకటించారు. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి ముందే అంటే డిసెంబర్‌లోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌తో సినిమా షూటింగ్‌ పూర్తి కాబోతుంది. దానికి తోడు పవన్‌ కళ్యాణ్‌ సినిమా సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్‌ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. దాంతో ముందుగా అనుకున్న ప్రకారం ఆ సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. దాంతో సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే చరణ్‌ ముందే వచ్చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై మెగా సన్నిహితుల నుండి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

అవి చెత్త వార్తలు.. మేమిద్దరం హ్యాపీ

జయ జానకి నాయక టీజర్ తో షాక్.