అవి చెత్త వార్తలు.. మేమిద్దరం హ్యాపీ

Varun Sandesh Wife Vithika Sheru Attempt Suicide Is Fake News

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Varun Sandesh Wife Vithika Sheru Attempt Suicide Is Fake News

‘హ్యాపీ డేస్‌’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వరుణ్‌ సందేశ్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. అయితే కాల క్రమేనా వరుణ్‌ సందేశ్‌కు సక్సెస్‌లు తగ్గడంతో పాటు, సినిమా ఛాన్స్‌లు తగ్గాయి. ఇక తనతో ఒక సినిమాలో నటించిన వితిక షేరును ప్రేమించిన వరుణ్‌ సందేశ్‌ ఆమెను గత సంవత్సరం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాపురంలో విభేదాలు మొదలయ్యాయని, ఇద్దరు కూడా కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారంటూ వారి సన్నిహితులు చెబుతూ ఉన్నారు. ఇద్దరు విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే వితిక షేరు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని, ఆమెను జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారని, రెండు రోజుల పాటు రహస్యంగా ఉంచి ఆమెను చికిత్స చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు జోరుగా వస్తున్నాయి. దాంతో స్వయంగా వితిక ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమే అని, తామిద్దరం సంతోషంగా ఉన్నామని, పెళ్లికి ముందులాగే ఇప్పటికి మేమిద్దరం ప్రేమించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయమై వరుణ్‌ సందేశ్‌ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇద్దరి మద్య విభేదాలు నిజమే అయితే వితిక షేరు ఆత్మహత్యయత్నం చేసిన విషయం కూడా నిజమే అయ్యి ఉంటుందని కొందరు అంటున్నారు. నిజం ఏంటి అనేది వారిద్దరికే తెలియాలి.

మరిన్ని వార్తలు:

నిన్నటి వరకు ఐశ్వర్య.. ఇప్పుడు సోనాక్షి కూడా

సంజయ్ గాంధీకి పెళ్ళికి ముందే కూతురుందా ?