బుల్లితెరపై దృష్టిపెట్టిన యువ హీరో

Varun Sandesh planning YouTube web series 'Hey Krishna'

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Varun Sandesh Planning Web Series ‘Hey Krishna’

‘హ్యాపీడేస్‌’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో వరుణ్‌ సందేశ్‌ ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌లను అందుకోవడంలో విఫలం అయ్యాడు. వరుసగా ఫ్లాప్‌లు రావడంతో సినిమాల్లో అవకాశాలు రావడమే గగనం అయ్యింది. ప్రస్తుతం ఈయన చేతిలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా సినిమా లేదు. ఇటీవలే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న వరుణ్‌ సందేశ్‌ మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నాడు. వెండి తెరపై అవకాశాలు రాకపోవడంతో వరుణ్‌ బుల్లి తెరను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. 

ఇటీవల యూట్యూబ్‌ వెబ్‌ సీరిస్‌కు ప్రాముఖ్యత పెరుగుతుంది. మెగా డాటర్‌ ఒక వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అదే విధంగా వరుణ్‌ సందేశ్‌ కూడా ఒక వెబ్‌ సిరీస్‌ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘హే కృష్ణ’ అనే వెబ్‌ సిరీస్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకుని మళ్లీ హీరోగా అవకాశాలు రాబట్టుకోవాలనేది వరుణ్‌ ప్రయత్నంగా తెలుస్తోంది. మరి వరుణ్‌ చేస్తున్న ఈ చివరి ప్రయత్నాలు సక్సెస్‌ అయ్యేనా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు