జైలవకుశ లీక్… ఎన్టీఆర్ ఫాన్స్ కి విన్నపం.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ntr jai lava kusa movie stills leaked

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీల నుంచి సినిమాల్ని కాపాడడం నిర్మాతల తలకు మించిన పని అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం మీద కళ్యాణ్ రామ్ నిర్మాణ సారధ్యంలో చేస్తున్న జైలవకుశ కి కూడా ఇదే సమస్య ఎదురైంది. ఈ సినిమాకి ఆన్ లైన్ ఎడిటర్ గా పనిచేసిన గణేష్ లీకేజ్ కి బాధ్యుడని నిర్మాతలు గుర్తించారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కి సంబంధించిన ఫోటోలు లీక్ చేసిన గణేష్ వాటిని విదేశాలలో వున్న తన మిత్రులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించినట్టు నిర్ధారణ కావడంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జైలవకుశ స్టిల్స్ లీక్ అయిన విషయాన్ని ముందుగా నిర్మాత కళ్యాణ్ రామ్ బయటికి చెప్పారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత అధికారి చురుగ్గా వ్యవహరించకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆ వెంటనే తప్పు చేసినట్టు భావిస్తున్న గణేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ప్రారంభ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని గణేష్ లీక్ చేసినట్టు గుర్తించారు. జైలవకుశ స్టిల్స్ లీక్ అయినట్టు తెలియడంతో ఎన్టీఆర్ ఫాన్స్ షాక్ అయ్యారు. కుట్రదారుల ఆలోచనలకు అనుగుణంగా లీక్ అయిన ఫొటోల్ని షేర్ చేయడం, ప్రచారంలోకి తీసుకురావడం తగదని నిర్మాతలు చేసిన విన్నపాన్ని మన్నిస్తూ ప్రవర్తిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు 

ఎన్టీఆర్ బెడ్ రూమ్ లో కెమెరాలు.

 బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌

బాలయ్యకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన అబ్బాయిలు