బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌

posani krishna murali clarity about on Bigg Boss Tv show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బుల్లి తెరపై సంచలనం సృష్టించేందుకు సిద్ద అవుతున్నాడు. జులై నెలలో స్టార్‌ మాటీ ద్వారా బిగ్‌ బాస్‌ షోతో ఎన్టీఆర్‌ వచ్చేందుకు రంగం సిద్దం అవుతుంది. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనేందుకు టాలీవుడ్‌ సెలబ్రెటీలను ఎంపిక చేసే పరిక్రియ జరుగుతుంది. ఇటీవల ఈ షోలో పోసాని కృష్ణ మురళి కనిపించబోతున్నాడని, ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పోసాని అందించడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. 2.5 కోట్ల పారితోషికం ఇచ్చి మూడు నెలల డేట్లను పోసాని నుండి స్టార్‌ మా వారు డేట్లు కూడా తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. 

తాజాగా బిగ్‌ బాస్‌ షోపై పోసాని స్పందించాడు. తనను స్టార్‌ మా వారు సంప్రదించినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు అని, తాను బిగ్‌ బాస్‌ షోకు ఎలాంటి డేట్లు ఇవ్వలేదు. ఆ షోకు సంబంధించి తనతో ఏ ఒక్కరు కూడా చర్చించలేదు అంటూ పోసాని క్లారిటీగా చెప్పేశాడు. దాంతో బుల్లి తెర ప్రేక్షకులు బిగ్‌ బాస్‌ షోలో పోసాని ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని భావించి నిరుత్సాహ పడుతున్నారు. పోసాని ఏ షోలో పాల్గొన్నా కూడా అది ఎంటర్‌టైన్‌గా సాగుతుంది. బిగ్‌ బాస్‌ షోలో కూడా ఉండి ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు ఇంకా పలువురు సెలబ్రెటీలతో బిగ్‌ బాస్‌ షో ఎంటర్‌టైన్‌గా సాగుతుందని నందమూరి ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్నివార్తలు 

క్రైమ్ కన్నా సెక్స్ ఎక్కువైంది.

పీవీ జయంతి స్పెషల్ స్టోరీ.

భరత్‌ భార్య గురించి షాకింగ్‌ విషయాలు