బాలయ్యకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన అబ్బాయిలు

ntr jai lava kusha releasing with balakrishna paisa vasool

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Ntr Jai Lava Kusha Releasing With Balakrishna Paisa Vasool

నందమూరి బాలకృష్ణ, పూరిల చిత్రం ‘పైసా వసూల్‌’ దసరా కానుకగా సెప్టెంబర్‌ 29న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. సినిమా ప్రారంభం సమయంలోనే పూరి చిత్రం విడుదల తేదీని ప్రకటించాడు. తాజాగా మరోసారి ఈ చిత్రం విడుదల తేదీపై పూరి క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సమయంలోనే బాలకృష్ణ సినిమాకు పోటీగా ఎన్టీఆర్‌ చిత్రం రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రం దసరా సందర్బంగా సెప్టెంబర్‌ 21న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

బాలయ్య సినిమా విడుదలకు వారం రోజులు ముందు ఎన్టీఆర్‌ సినిమా రానున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘జై లవకుశ’ చిత్రం వల్ల బాలకృష్ణ సినిమాకు కలెక్షన్స్‌ దెబ్బ పడే అవకాశాలున్నాయని వారు భావిస్తున్నారు. మరో వైపు బాలయ్య సినిమాకు మాత్రమే కాకుండా ఎన్టీఆర్‌ చిత్రం మహేష్‌బాబుకు కూడా పోటీ రాబోతుంది. మహేష్‌బాబు, మురుగదాస్‌ల చిత్రం సెప్టెంబర్‌ 21న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. సరిగ్గా అదే రోజు ఎన్టీఆర్‌ చిత్రం కూడా రానున్న నేపథ్యంలో దసరాకు పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రం చివరి దశ షూటింగ్‌లో ఉన్నాడు. ‘జై లవకుశ’ చిత్రంలో హీరోయిన్స్‌గా నివేదా థామస్‌ మరియు రాశి ఖన్నాలు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు

డీజే దుమ్ము రేపాడు – దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ రివ్యూ