జక్కన్న గురించి అతి చెత్త వార్త

Rajamouli Will Have A Movie With Jabardast Sudhir

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

S.S. Rajamouli Will Have A Movie With Sudhir

‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి కొంత గ్యాప్‌ తీసుకోవాలని భావిస్తున్నాడు. జక్కన్న తర్వాత సినిమాకు కనీసం ఆరు నెలలైనా సమయం తీసుకుంటాడని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే ఈ సమయంలో జక్కన్న తర్వాత సినిమా అదిగో, ఇదిగో అంటూ మీడియాలో ప్రచారం తారా స్థాయిలో జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు జక్కన్న తర్వాత సినిమా ఎన్టీఆర్‌ లేదా అల్లు అర్జున్‌ అదీ కాదంటే ప్రభాస్‌తోనే మళ్లీ రాజమౌళి సినిమా చేస్తాడు అని వార్తలు వచ్చాయి. కాని తాజాగా అతి చెత్త వార్త ఒకటి జక్కన్న తర్వాత సినిమా గురించి వస్తుంది.

జబర్దస్త్‌ బూతు కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో రాజమౌళి తర్వాత సినిమా ఉండనుందట. ‘మగధీర’ చిత్రం తర్వాత రాజమౌళి చిన్న హీరో సునీల్‌తో ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని చేసి తనేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా స్టార్స్‌ లేకుండానే సక్సెస్‌ కొడతాను అని నిరూపించుకునేందుకు సుడిగాలి సుధీర్‌తో రాజమౌళి సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఇవి పక్కా ఫేక్‌ న్యూస్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు ఆకతాయిలు సోషల్‌ మీడియాలో ఇలా పుకార్లు క్రియేట్‌ చేయడం కొందరు వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. జక్కన్న తర్వాత సినిమా ఖచ్చితంగా ఒక స్టార్‌ హీరోతో, అదీ భారీ బడ్జెట్‌తో ఉంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు

డీజే’ను బ్యాన్‌ చేయాలట!

బిగ్‌బాస్‌లో పోసాని.. 2.5 కోట్ల పారితోషికం

 

జక్కన్న గురించి అతి చెత్త వార్త - Telugu Bullet