బ్రాహ్మణులకి ముద్రగడ పిలుపు ఇదే.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో మీ తడాఖా చూపాలని బ్రాహ్మణులకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఐవైఆర్ కృష్ణారావు విషయంలో చంద్రబాబు సర్కార్ అన్యాయంగా వ్యవహరించిందని ముద్రగడ ఆరోపించారు. సీఎం చంద్రబాబుకి ఆయన మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాపుల రిజర్వేషన్ సాధన కోసం తలపెట్టిన పాదయాత్ర జరిపితీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. వచ్చే నెల 26 నుంచి కిర్లంపూడి దగ్గర మొదలయ్యే పాదయాత్ర అమరావతి దాకా సాగుతుందన్నారు. ఈసారి యాత్రని ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని ముద్రగడ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర రూట్ మ్యాప్ ని ముద్రగడ విడుదల చేశారు.

 mudragada wrote letter to Chandrababu about padayatraమరిన్నివార్తలు 

ఏపీలో బ్రాహ్మణ రాజకీయం