ఏపీలో బ్రాహ్మణ రాజకీయం

Brahmin Cast Politics in AP with Ex CS IV Krishna Rao

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Brahmin Cast Politics In AP With Ex CS IV Krishna Rao Facebook Postings

ఐవైఆర్ కృష్ణారావు ఎపిసోడ్ తర్వాత ఏపీలో బ్రాహ్మణ పాలిటిక్స్ ఆసక్తికరంగా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ కు భారీగా నిధులిచ్చినా.. అనుకున్న మైలేజ్ రాకపోగా.. దిద్దుకోలేని డ్యామేజ్ జరిగిందని టీడీపీ నేతలు మథనపడుతున్నారు. ఇటు ఐవైఆర్ సాకుతో రెచ్చిపోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. కానీ బ్రాహ్మణ సామాజికవర్గం అసలేమనుకుంటోందన్నదే కీలకం.

ఐవైఆర్ కృష్ణారావు పాపులర్ లీడర్ కాదు. ఇక ఆయనకు వకాల్తా పుచ్చుకుంటున్న వైసీపీ నేతలూ పాపులర్ కాదు. వారిపై ఎవరికీ ఎలాంటి నమ్మకం లేదు. ఐవైఆర్ జీతం తీసుకోకుండా పనిచేశారంటే.. ఆయన ఏంటో తెలిసిన అధికారులే నమ్మడం లేదు. ఇక జనం నమ్ముతారనుకోవడం భ్రమే. ఐవైఆర్ ఫేస్ బుక్ పోస్టుల షేరింగ్ ప్రభుత్వ పదవిలో ఉండి చేయడం క్రిమినల్ నేరం. కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం.

అసలు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఏరికోరి కుల సంఘానికి ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడమే పెద్ద సంచలనమైతే.. ఆయన ఈ విధంగా సర్కారును ఫక్తు రాజకీయ నాయకుడిలా తిట్టడం ఇంకా విడ్డూరం. ఐవైఆర్ కు బ్రాహ్మణుల మద్దతు ఉంటే ఈపాటికి నిరసనలు జరిగేవి. కానీ అంత సీన్ లేదని తేలిపోయింది. వర్కవుట్ అంశాన్ని పట్టుకుని వైసీపీ సాధించేది శూన్యమేనని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు