‘డీజే’కు కలిసి వచ్చే అంశం

Due to Ramzan's announcement of holiday and tomorrow's government vacation due to the Ramadan, it will be a huge collection o

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

DJ Movie Record Collections At Box Office

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ చిత్రం నేడు అంటే సోమవారం రంజాన్‌ కారణంగా సెలవు మరియు రేపు ప్రభుత్వం సెలవును ప్రకటించిన కారణంగా మరింగా భారీ కలెక్షన్స్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి మూడు రోజులు కాకుండా మరో రెండు రోజులు సెలవు వస్తే భారీ కలెక్షన్స్‌ ఖాయం. ఇప్పుడు ‘డీజే’కు అదే కలిసి వచ్చే అంశం అయ్యింది.

‘డీజే’ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. దానికి తోడు ఈ సినిమాకు సెలవులు కలిసి వచ్చే అంశం. మొదటి మూడు రోజుల్లో 70 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లో మరో 30 కోట్లు వసూళ్లు సాధించి 100 కోట్ల గ్రాస్‌ వసూళ్లను ‘డీజే’ చిత్రం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వరుస సెలవులకు తోడుగా ఈ చిత్రంకు పోటీగా మరే సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద లేక పోవడం కూడా కలిసి వచ్చే అంశం. అందుకే ‘డీజే’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. బన్నీ కెరీర్‌లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వార్తాలు:

శ్రీదేవితో 25వది చేయాలనుందట

శృతిహాసన్‌ పరువు తీశారు!