పవన్‌ తీరేం అర్థం కావడం లేదు!

Dil Raju To Produce Film With Pawan Kalyan next Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Dil Raju To Produce Film With Pawan Kalyan next Movie

పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. ఆ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ పలు సందర్బాల్లో స్వయంగా చెప్పుకొచ్చాడు. పవన్‌ కళ్యాన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు త్వరలోనే సినిమాలను పక్కన పెట్టడం ఖాయంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాలేమీ ఒప్పుకోడు అని ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే పవన్‌ కొత్త సినిమాలు ఒప్పుకుంటూనే ఉన్నాడు. దిల్‌రాజు చాలా కాలంగా పవన్‌తో ఒక్క సినిమాను నిర్మించాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక తీరే సూచనలు కనిపిస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ వచ్చే సంవత్సరం దిల్‌రాజుకు డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఒక మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేద్దాం, వచ్చే సంవత్సరంలో ఎప్పుడంటే అప్పుడు తాను సిద్దంగా ఉన్నాను అంటూ పవన్‌ స్వయంగా దిల్‌రాజుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మంచి కథ మరియు దర్శకుడు కావాలంటూ పవన్‌ కండీషన్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ కోసం దిల్‌రాజు కథలు సిద్దం చేయించే పనిలో పడ్డాడు. ఈ సంవత్సరం చివరి వరకు కథలు వినిపించి, ఓకే చెప్పించుకుని వచ్చే సంవత్సరంలో పవన్‌తో సినిమాను ప్రారంభించి, అదే సంవత్సరంలో విడుదల చేయాలని దిల్‌ రాజు ఉవ్విల్లూరుతున్నాడు. మరి అది సాధ్యం అయ్యేనా అనేది చూడాలి.

మరిన్ని వార్తాలు:

‘డీజే’కు కలిసి వచ్చే అంశం

బ్రాహ్మణులకి ముద్రగడ పిలుపు ఇదే.