సమంత మాకు అదృష్టం

Amala Says We Are very Lucky To Have Samantha Like Daughter In Law

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Amala Says We Are very Lucky To Have Samantha Like Daughter In Law

అక్కినేని వారి ఇంటి కోడలిగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత త్వరలోనే అడుగు పెట్టబోతున్న విషయం తెల్సిందే. సమంతకు అక్కినేని నాగచైతన్యకు ఇప్పటికే వివాహ నిశ్చితార్థం అయ్యింది. వారిద్దరి పెళ్లిని అక్టోబర్‌లో పెట్టుకోబోతున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు మెల్ల మెల్లగా జరిగి పోతున్నాయి. ఇటు అక్కినేని ఫ్యామిలీ అటు సమంత కుటుంబ సభ్యులు అప్పుడే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా సమంత అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతున్న నేపథ్యంలో అమల అక్కినేని స్పందించారు.

నాగచైతన్యతో ప్రేమ విషయం తెలిసినప్పటి నుండి కూడా సమంతతో అమల చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. కొన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటివి కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరు కలిసి పోయారు. తాజాగా సమంత గురించి అమలా మాట్లాడుతూ సమంత మా కుటుంబంకు కోడలుగా రావడం మా అదృష్టం అంటూ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపర్చింది. సమంత వంటి కలిసి పోయే అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారు, మా అందరితో ఇప్పటికే సమంత కలిసి పోయిందని, చైతూ, సమంత జీవితం సంతోషంగా ఉంటుందనే నమ్మకం తనకుందని అమ పేర్కొంది. చైతూ సొంత తల్లి కాకున్నా కూడా అమలా చేసిన ఈ వ్యాఖ్యలు ఆమెపై మరింత గౌరవంను పెంచుతున్నాయి.

మరిన్ని వార్తలు:

నో పాలిటిక్స్‌

జనసేన ప్రస్థావన తెచ్చినందుకు కమెడియన్‌పై పవన్‌ సీరియస్‌