బిగ్‌బాస్‌ షోపై మంచు లక్ష్మి క్లారిటీ

Manchu Lakshmi Sensational Comments on Jr NTR Big Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Manchu Lakshmi Sensational Comments on Jr NTR Big Boss Show

ఎన్టీఆర్‌ హోస్ట్‌గా స్టార్‌ మాటీవీలో ప్రసారం కాబోతున్న ‘బిగ్‌బాస్‌’ షోలో కనిపించబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తారా స్థాయిలో ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్‌ షోలో నిన్నటి తరం హీరోయిన్స్‌ అయిన స్నేహ, రంభ, సదాతో పాటు మంచు లక్ష్మి, మధుశాలిని, తేజస్విలు పాల్గొంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు మా వర్గాల నుండి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు మంచు లక్ష్మి తన గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

బిగ్‌ బాస్‌ షోలో తాను పాల్గొనబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, తనను బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు సంప్రదించిన విషయం నిజమే కాని, తాను కొన్ని కారణాల వల్ల షోకు నో చెప్పినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. దాంతో బిగ్‌ బాస్‌ షో గురించి వస్తున్న వార్తలకు బ్రేక్‌ పడ్డట్లయ్యింది. మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాల్లో కూడా నటించడం లేదు. ఎందుకు ఆమె ఈ షోకు నో చెప్పిందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక మిగిలిన వారిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈనెల 16 నుండి స్టార్‌ మాటీవీలో ఈ షో ప్రసారం కాబోతుంది. ఆ రోజు కంటే ముందే సెలబ్రెటీలు ఎవరు అనే విషయంపై క్లారిటీ వస్తుందని కొందరు అంటున్నారు. అయితే సెలబ్రెటీలను ఆరోజే ఎన్టీఆర్‌ పరిచయం చేస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు కూడా ఇప్పటి వరకు బిగ్‌ బాస్‌ షో లో పాల్గొనబోతున్న సెలబ్రెటీలు ఎవరు అనే విషయం తెలియదట.

మరిన్ని వార్తలు:

నిన్నటి వరకు ఐశ్వర్య.. ఇప్పుడు సోనాక్షి కూడా

సమంత మాకు అదృష్టం