వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్త దనం మిస్

ys jagan manifesto

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తండ్రి పథకాలు కంటిన్యూ. బాబు పథకాలు కాపీ, కేసీఆర్ పథకాలు జిరాక్సు. ఇంతే వైసీపీ మ్యానిఫెస్టో. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏముందని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. పైగా జగన్ ఏదో ప్లీనరీలో భూమి బద్దలు చేస్తాడనుకుంటే.. అందరూ ఇచ్చిన హామీల్నే అటూ ఇటూ తిప్పి ఇచ్చారని, పాదయాత్రకు బూస్ట్ ఇచ్చే హామీ ఒక్కటీ లేదేంటని మొత్తుకుంటున్నారు కార్యకర్తలు. కానీ జగన్ మాత్రం తాను ఎవ్వరూ ఇవ్వని విధంగా ఎన్నికలకు రెండేళ్ల ముందే హామీలిచ్చానని, అదే హాట్ న్యూస్ అని డబ్బా కొట్టుకుంటున్నారు.

పథకం అంటే మన సొంత బుర్రలోంచి రావాలి. అంతే కానీ పక్కోడి స్కీములు కాపీ కొట్టడం కాదు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే రెండ్రూపాయల కిలో బియ్యం పథకం గుర్తుకొస్తుంది. వైఎస్ అంటే ఆరోగ్యశ్రీ అంటారు పేదలు. అలాగే చంద్రబాబు అంటే మొన్నటివరకు హైటెక్ సీఎం అనే మాట వినిపించింది. ఇప్పుడు రుణమాఫీ హామీ వినిపిస్తోంది. అలాంటి ట్రేడ్ మార్క్ స్కీమ్ జగన్ కు ఎక్కడుందని కార్యకర్తలు నేతల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో సీనియర్ నేతలు కూడా ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నారట.

ప్రశాంత్ కిషోర్ ను అరువు తెచ్చుకున్నాక కూడా మనకు ప్లాన్లు రెడీ కాలేదా అని ప్లీనరీ ప్రాంగణంలో క్యాడర్లో పెద్ద చర్చే నడిచింది. చివరకు తేలిందేంటంటే.. కొత్త హామీలిస్తే జనం నమ్మరని, పాత హామీలకు తాలింపు వేయమని ప్రశాంత్ కిషోరే సెలవిచ్చారట. దీంతో ఆయన నిర్వాకం కోసం ఎన్నికల దాకా ఆగక్కర్లేదని, ఇప్పుడే బయటపడిందని వైసీపీలోని ఓ వర్గం మండిపడుతోంది. వద్దంటే వినకుండా ప్రశాంత్ టీమ్ కు వందల కోట్లు ఖర్చుపెడుతున్నారి, ఈ ఖర్చు మొన్నటి ఎన్నికల్లో పెట్టినా, రుణమాఫీ హామీ ఇచ్చినా అధికారం దక్కేదని నెత్తీనోరు మొత్తుకుంటున్నారట. ఏం చేస్తాం ఏధి దక్కిందో అదే ప్రాప్తం.

మరిన్ని వార్తలు

సినిమాల్లోకి వస్తున్న మాజీ సీఎం భార్య ?

జేసీ చెప్పే ఆ మీడియా అధిపతులు ఎవరబ్బా ?