రాముడి లీల.. రామదాసు గోల

Ramdas athawale updates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఓవైపు యూపీలో రామమందిరం నిర్మాణం కోసం వీ హెచ్ పీ రాళ్లెత్తుతుంటే.. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అధినేత, ఎన్డీఏ భాగస్వామి రాందాస్ అథవాలే దళితుల్ని పట్టించుకోవాలని గళమెత్తారు. పైగా ఎవ్వరూ కనీవినీ ఎరుగని వినూత్న ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. ఆయన మాటలు విని.. ప్రధాని కూడా కంగు తిన్నారట. బీజేపీ హిస్టరీలోనే కాదు.. అసలు ఇండియా చరిత్రలోనే ఇలాంటి డిమాండ్లు ఎవరూ చేయలేదని, రాందాస్ అంబేద్కర్ ను మించిపోయారని ఆయన అనుచరులు మాత్రం జబ్బుల చరచుకుంటున్నారట.

కానీ రాందాస్ అథవాలే డిమాండ్లు వింటే మూడో తరగతి పిల్లాడు కూడా నవ్వేలా ఉన్నాయి. కులాంతర వివాహాలతో కుల వివక్షకు చెక్ పెట్టొచ్చని సూచించారు కేంద్రమంత్రి. బీహార్, రాజస్థాన్లో దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, అక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలను ప్రోత్సహించాలని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు అథవాలే. కానీ హానర్ కిల్లింగ్ గురించి మాత్రం ఆయన మర్చిపోయినట్లున్నారు. పిల్లలు చేసుకున్నా.. పెద్దలు బతకనివ్వాలిగా అంటే.. ఐదు లక్షల ఆర్థిక సాయం చేసి నోరు మూయించాలని కూడా సలహా ఇస్తున్నారు.

దేశంలో అందరూ మతంగా భావించే క్రికెట్ కు కూడా పైత్యం అంటగట్టాడు రాందాస్. క్రికెట్ టీమ్ లో 25 శాతం దళితులకు రిజర్వ్ చేయాలని సూచించారు. క్రికెట్ అనేది ప్రతిభ ఆధారిత ఆట. ఇందులో రిజర్వేషన్లు ఏంటని జనం విస్తుబోతున్నారు. అదేమంటే సౌతాఫ్రికాలో నల్లవాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా అని రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పిచ్చి ముదిరింది రోలుకు కట్టండి అన్నట్లుగా అథవాలే తన పరువు తానే తీసుకుంటున్నారని బీజేపీ నేతలు మథనపడుతున్నారు.

మరిన్ని వార్తలు

వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్త దనం మిస్

జేసీ చెప్పే ఆ మీడియా అధిపతులు ఎవరబ్బా ?