దత్తన్నకు అదను చూసి హ్యాండిచ్చిన కేసీఆర్

Dattanna insulted at Mahankali Temple

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఢిల్లీలో సొంత పార్టీ నేతల్ని కూడా పూర్తిగా నమ్మని కేసీఆర్.. దత్తాత్రేయను మాత్రం బాగా నమ్ముతారట. హస్తినలో ఏం కావాలన్నా, చివరకు వెకయ్యను కలవాలన్నా మొదట ఆప్తమిత్రుడు కేంద్రమంత్రి బండారు దగ్రికే వెళ్లి, అక్కడ్నుంచే పనులు చక్కబెడతారట. కానీ అంతటి దత్తాత్రేయకు బోనాల సాక్షిగా ఘోరమైన అమానం జరిగింది. రాష్ట్ర మంత్రులు, చివరకు అధికారుల పాటి విలువ కూడా దత్తాత్రేయకు లేకుండా పోయింది.

దత్తాత్రేయ సహజంగా సింపుల్ గా ఉంటారు. అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సమయంలో ఆయన భార్య అనారోగ్యంతో ఉన్నారు. అందుకే ఆలయ ప్రధాన ద్వారం వరక తన కారు అలో చేయాలని దత్తాత్రేయ రిక్వెస్ట్ చేశారు. కానీ దానికి నిరాకరించిన పోలీసులు.. దత్తన్న భార్యను చాలా దూరం నడిపించారు. కానీ తర్వాత వచ్చిన సీఎం, మంత్రులు, అధికారుల కార్లను మాత్రం గుడి దాకా అనుమతించారు. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. కానీ బీజేపీలో మరో వర్గం మాత్రం చాలా ఖుషీగా ఉంది. ఇన్నాళ్లూ బీజేపీ కార్యకర్తనని మరిచిపోయి.. ఫక్తు గులాబీ నేతగా మాట్లాడుతున్న దత్తాత్రేయకు తిక్క కుదిరిందని ఆనంద పడుతున్నారట. అటు మోడీ, అమిత్ షా కూడా దత్తాత్రేయ టీఆర్ఎస్ కు దగ్గరౌతున్నారని సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు పబ్లిగ్గా జరిగిన అవమానం తర్వాతైనా దత్తన్న మారతారా.. మళ్లీ కేసీఆర్ తో అలయ్ బలయ్ అంటారో చూడాలి.