జగన్ పాదయాత్రపై పవన్ వెరైటీ రెస్పాన్స్.

Janasena Chief Pawan Kalyan Reaction On Ys Jagan Padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రకటన గురించి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వెరైటీగా స్పందించారట. జనసేన ముఖ్యనేతలంతా కూర్చున్నప్పుడు వైసీపీ ప్లీనరీ విషయం చర్చకి వచ్చిందట. జగన్ పాదయాత్ర చేయబోతున్న విషయాన్ని ఓ నాయకుడు పవన్ తో అన్నప్పుడు ఆయన సానుకూలంగా రెస్పాండ్ అయ్యారట. అప్పుడు పవన్ రియాక్షన్ ఇలా ఉందట.

” నేను అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడే పాదయాత్ర ప్రకటన చేశా. నా ప్రకటన తర్వాత ఇంకొకరు అదే బాటలో నడుస్తున్నారంటే ఏమి చెప్పాలో అర్ధం కావడం లేదు. ఎవరు పాదయాత్ర చేసినా ప్రజల సమస్యల మీద చర్చ జరిగి అవి పరిష్కారం అయితే అంత కన్నా కావాల్సింది ఏముంది ? అప్పుడు నేను కూడా సంతోషపడతా. ఆ క్రెడిట్ నాకు రాకపోయినా పర్వాలేదు. ఆ క్రెడిట్ ఇంకొకరికి వెళ్లినా నేనేమీ పట్టించుకోను”. ఈ విధంగా పవన్ స్పందించడంతో జనసేన నేతలకు ఎలా ప్రతిస్పందించాలో అర్ధం కాలేదట. ఓ నాయకుడు అయితే పక్కకి వచ్చి రాజకీయాల్లో వుంటూ పోటీ లేదంటే ఎలా అని వాపోయాడంట.

మరిన్ని వార్తలు

వైసీపీ లో పీకే టెర్రర్.

సంజయ్ గాంధీకి పెళ్ళికి ముందే కూతురుందా ?

దత్తన్నకు అదను చూసి హ్యాండిచ్చిన కేసీఆర్