ఐకాన్ స్టార్ తో దీపికా పడుకోణె ?

ఐకాన్ స్టార్ తో దీపికా పడుకోణె ?
Cinema News

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆల్ రెడీ తన కొత్త ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. ఈ చిత్రం 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతోంది . ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఐతే, తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పడుకోణె ను హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా పడుకోణె ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ బన్నీ సరసన స్టెప్స్ వేస్తే అదిరిపోతుంది. అన్నట్టు సెకండ్ హీరోయిన్ గా పూజా హెగ్డేని ఈ సినిమాలో తీసుకోబోతున్నారట…..

పూజాని తీసుకుంటే.. అల వైకుంఠపురములో కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయినట్టే. ఇక జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టినట్టు అయ్యింది. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూట్ లో బిజీగా ఉన్నాడు.