ధనుష్ మారి – 2 ఫస్ట్ లుక్ ఇదే…!

Dhanush-Maari-2-First-Look-

తమిళ హీరో ధనుష్ కి తెలుగులో కూడా మాంచి ఫాలోయింగే ఉంది. రఘువరన్ బి.టెక్ విజయం తరువాత ధనుష్ నటించిన అనేక సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి కానీ ఒక్కటీ విజయం సాధించలేదు. రఘువరన్ బి.టెక్ కి సీక్వెల్ అంటూ వచ్చిన వీ.ఐ.పి అయితే ఘోర పరాజయం అయ్యింది. ఆ తరువాత తెలుగులో వచ్చిన రైల్ సినిమా కూడా థియేటర్లలో సరిగ్గా ఆడనేలేదు. ఈ సవంత్సరమే ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ అఫ్ ది ఫకీర్ అనే ఇంగ్లీష్ సినిమాతో హాలీవుడ్ కి కూడా పరిచయం అయ్యాడు. ధనుష్ తాజాగా నటించిన వడ చెన్నై అనే మూవీ తమిళ్ లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తమిళ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రియలిస్టిక్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఎందుకో తెలుగులో విడుదల కాలేదు.

danush-movies

ఇక అసలు విషయానికి వస్తే, ధనుష్ హీరోగా మారి – 2 అనే సినిమా తమిళంలో రూపొందుతుంది. ఇది 2015 లో తమిళంలో విడుదలైన మారి సినిమాకి సీక్వెల్. ఈ మారి సినిమానే మాస్ అనే పేరుతో తెలుగులో విడుదలైన విషయం ఎవరికి తెలవకపోగా, సినిమా థియేటర్లలో కన్నా, యూట్యూబ్ లో ఎక్కువగా ఆడింది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ మరో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఏమిటో, ఈ మధ్య ఏ తమిళ సినిమా చూసిన ఈ వరలక్ష్మి శరత్ కుమారే కనిపిస్తుంది (పందెం కోడి – 2, సర్కార్, మారి -2). యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ధనుష్ తన వండర్ బార్ ఫిలిమ్స్ పతాకం పై నిర్మిస్తున్నాడు. సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా తెలుగు లో కూడా ఒకేసారి విడుదల అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి.

marry-2-movie

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ధనుష్ లుక్ మారి సినిమాలో మాదిరిగానే ఉండడంతో, చూసినవాళ్లలో ఆశ్చర్యం ఏమి కలిగించడం లేదు. దీపావళి మిరపకాయ బాంబు ని చేతిలో పేలుస్తున్న ధనుష్ ఈ సినిమా ట్రైలర్ దీపావళి రోజున విడుదల అవుతుందనే హింట్ ఇస్తున్నట్లుగా ఉంది. కాగా, ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రకటించారు. కానీ, ఏ తేదీన విడుదల అవుతుందో మాత్రం ఖరారు చేయలేదు. మారి-2 తెలుగు వెర్షన్ గురించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం గానీ ఇవ్వలేదు సరికదా, కనీసం టైటిల్ కూడా తెలుగులో రివీల్ చేయలేదు.