చీరలతో రాజుగారి పబ్లిసిటీ సూపర్‌

Dil raju bumper offer for marriage couples

ఈమద్య కాలంలో సినిమాలు తీయడం కంటే వాటిని ప్రమోషన్‌ చేయడంలో చిత్ర నిర్మాతలు మరియు దర్శకులు క్రియేటివిటీని చూపించాల్సి ఉంటుంది. క్రియేటివిటీతో పబ్లిసిటీ చేస్తేనే ప్రేక్షకుల దృష్టిని సినిమా ఆకర్షిస్తుంది. పెద్ద సినిమాలంటే స్టార్‌ హీరోలు ఉంటారు కనుక పెద్దగా పబ్లిసిటీ చేయకుండానే ప్రేక్షకుల్లోకి చేరిపోతుంది. కాని చిన్న చిత్రాలు మాత్రం చాలా పబ్లిసిటీ చేస్తే తప్ప ప్రేక్షకుల్లోకి వెళ్లడం కష్టం. చిన్న చిత్రాలు కోటి పెట్టి తెరకెక్కుతుండగా, అరకోటితో పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక తన సినిమాలను భారీగా నిర్మించడమే కాకుండా, విభిన్న రీతిలో పబ్లిసిటీ చేయడంలో దిల్‌రాజు ముందు ఉంటాడు.

Dil raju bumper offer for marriage couples

తాజాగా దిల్‌రాజు బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ చిత్రంకు మొదటి నుండి చాలా విభిన్నంగా పెళ్లి తంతుతో పబ్లిసిటీ చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంను మరో విధంగా కూడా ప్రమోట్‌ చేసేందుకు దిల్‌రాజు స్కీం పెట్టాడు. వచ్చేది శ్రావణమాసం అవ్వడంతో కొత్తగా పెళ్లి చేసుకునేవారికి శ్రీనివాస కళ్యాణం టీం తరపున భారీ ఎత్తున బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి కార్డును చిత్ర యూనిట్‌ సభ్యులకు పంపించినట్లయితే కొందరిని ఎంపిక చేసి, ఖరీదైన చీర మరియు కొన్ని బహుమానాలను కూడా ఇవ్వాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నాడు. మొత్తానికి చిత్రంను ప్రమోట్‌ చేసేందుకు అన్ని మార్గాలను రాజుగారు వాడేస్తున్నాడు.