ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడ‌మ్ సేల్ : 80 శాతం వరకూ డిస్కౌంట్

the big freedom sale from flipkart for this independence day

తమ వినియోగదారులను ఆకట్టుకునే విషయంలో ముందు వరుసలో ఉండే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరో సారి సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ సైతం 3 రోజుల పాటు అందుబాటులో ఉండేలా ది బిగ్ ఫ్రీడ‌మ్ సేల్ ప్ర‌క‌టించింది. బిగ్‌ ఫ్రీడమ్ సేల్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది. శాంసంగ్, ఆపిల్‌, షావోమి స్మార్ట్ ఫోన్లు ఎంపిక చేసుకున్న ల్యాప్‌టాప్‌లపై 80 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ ఆఫర్ ఆగస్టు 9వ తేదీ నుంచి 12 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. 72 గంటలపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. దానికి సంబంధించి బ్లాక్ బ‌స్ట‌ర్ డీల్స్, ప్రైస్ క్రాష్ ఆఫ‌ర్స్, ర‌ష్ అవ‌ర్ డీల్స్ వంటివి ఉంటాయ‌ని తెలుస్తోంది.