ఆసక్తి రేపుతున్న మహేష్‌ 25 టైటిల్‌

fans interesting on mahesh babu 25th movie title

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మహేష్‌ బర్త్‌డే సందర్బంగా విడుదల చేసేందుకు దర్శకుడు వంశీ పైడిపల్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. చిత్రంలో మహేష్‌బాబు ఎలా ఉండబోతున్నాడు, మహేష్‌ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రను చేస్తున్నాడు అంటూ గత కొంత కాలంగా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి టైటిల్‌కు సంబంధించిన క్లూ స్‌ ఇస్తూ వస్తున్నాడు. మొదట ‘ఆర్‌’ లెటర్‌ను పోస్ట్‌ చేసిన వంశీ ఆ తర్వాత రోజు ‘ఐ’ ఆ తర్వాత రోజున ‘ఎస్‌’ను పోస్ట్‌ చేయడం జరిగింది. ఈ లెటర్స్‌తో టైటిల్‌ ఉంటుందంటూ ఆయన చెబుతున్నాడు.

fans interesting on mahesh babu 25th movie title

ప్రస్తుతం ఆ టైటిల్‌ను గెస్‌ చేసేందుకు ఫ్యాన్స్‌ విపరీతంగా కష్టపడుతున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కూడా కొందరికి ఇంకా టైటిల్‌ రివీల్‌ కాలేదు. త్వరలోనే టైటిల్‌ లోగోతో ఉన్న పోస్టర్‌ను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఇలా టైటిల్‌కు సంబంధించిన హిట్స్‌ ఇస్తూ అందరిలో చర్చకు తెర లేపుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మహేష్‌ 25వ చిత్రం ఫ్యాన్స్‌కు పెద్ద పండగను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. భరత్‌ అనే నేను చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. మహేష్‌ కెరీర్‌లో మొదటి వంద కోట్ల షేర్‌ దక్కించుకున్న చిత్రంగా ఆ చిత్రం రికార్డు సృష్టించింది. ఇప్పుడు మహేష్‌ 25వ చిత్రం కూడా మరో వంద కోట్లను మహేష్‌బాబు ఖాతాలో వేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరిలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే.