తెలుగుదేశాన్ని గెలిపించిన కాంగ్రెస్…మళ్ళీ రిపీట్ !

TDP MP Cm Ramesh Elected As PAC Member
రాజ్యసభలో నిన్నటిరోజున అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే మామూలుగానే బీజేపీకి బలం తక్కువ అలాంటి సమయంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రాతినిధ్య ఎన్నిక రావడంతో బీజేపీకి ఎప్పుడు బుడ్డి చెబుదామా అనుకుని రెడీగా ఉన్న  పార్టీలన్నీ ఏకమయ్యాయి. దీంతో సభలో ఓటింగ్ పెట్టగా అందులో తెలుగుదేశం పార్టీ కి చెందిన సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి కన్నా ఏకంగా 37 ఓట్లు ఎక్కువగా తెచ్చుకుని సంచలనం సృష్టించారు. బీజేపీ అభ్యర్థికి కేవలం 69 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థిగా పోటీ పడిన ..ఎన్డీఏ పార్టీ జేడీయూ అభ్యర్థికి అత్యల్పంగా 26 ఓట్లు మాత్రమే వచ్చాయి.
TDP MP Cm Ramesh And bhupendra yadav,jdu harivansh
రాజ్యసభ నుంచి పీఏసీకి ఉండే రెండు పోస్టుల కోసం ముగ్గురు టీడీపీ నుంచి సీఎం రమేష్, బీజేపీ నుంచి భూపేంద్రయాదవ్, జేడీయూ నుంచి హరివంశ్ పోటీ పడ్డారు. వోటింగ్ జరుగగా సీఎం రమేష్ కు 106 ఓట్లు, బీజేపీ అభ్యర్థి భూపేంద్రయాదవ్ కు 69 ఓట్లు వచ్చాయి. జేడీయూ నేత హరివంశ్ కు కేవలం ఇరవై ఆరు ఓట్లు మాత్రమే రావడంతో పరాజయం పాలయ్యారు. రాజ్యసభలో జరిగిన ఈ ఓటింగ్ ప్రక్రియ రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేకెత్తించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు కాంగ్రెస్, అన్నాడీఎంకే, సీపీఎం, సీపీఐ పార్టీల సభ్యులు మద్దతుగా నిలిచారు. బీజేపీకి మాత్రం సొంత సభ్యులు మాత్రమే ఓట్లేశారు. బీజేపీ అభ్యర్థి భూపేంద్రసింగ్.. అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. అందుకే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులంతా.. కచ్చితంగా ఓటింగ్ హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. మరో మూడు రోజుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల జరగనుండటంతో.. ఈ ఓటింగ్ ..ఢిల్లీ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ ఓటింగ్ సరళి అడ్డం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి ఇతర మిత్రపక్షాలేవీ మద్దతుగా నిలబడక పగా మిత్రపక్షమైన జేడీయూ తరపున పోటీ చేసిన హరివంశ్ గెలుపు కోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలేక్ వశం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.