నెహ్రూను మించిపోయిన మోదీ.. అద్భుతమైన ప్రసంగం..

Narendra Damodardas Modi is an Indian politician who has served as the 14th Prime Minister of India
Narendra Damodardas Modi is an Indian politician who has served as the 14th Prime Minister of India

ప్రధాని నరేంద్రమోదీ సరికొత్త రికార్డును సృష్టించారు. చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఖ్యాతికెక్కారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడి అబ్బురపరిచారు. ఆకట్టుకునే ప్రసంగం చేసి దేశ ప్రజల మనసును దోచుకున్నారు. సరికొత్త రికార్డును సృష్టించారు.ఇప్పటి వరకు పదిసార్లు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. ఇతర ప్రధానలతో పోల్చుకుంటే ఎక్కువ.

2014లో ప్రధాని మోదీ నేతృత్యంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 86 నిమిషాల పాటు 2015లో ,96 నిమిషాల పాటు 2016లో , 56 నిమిషాల పాటు 2017లో, 83 నిమిషాల పాటు 2018లో ప్రసంగించారు. 2019లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. 92 నిమిషాల పాటు 2019లో మోదీ ప్రసంగించారు. 90 నిమిషాల పాటు 2020లో, 88 నిమిషాల పాటు 2021లో, గత ఏడాది వేడుకల్లో 74 నిమిషాల పాటు ప్రసంగించారు. 90 నిమిషాల పాటు ఈ ఏడాది మళ్లీ అద్భుత ప్రసంగం చేశారు.

స్వాతంత్ర అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ లాల్ నెహ్రూ.. తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 24 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధానిగా ఎక్కువసార్లు పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించింది నెహ్రూనే. మొత్తం 17 సార్లు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాల పాటు మాట్లాడారు.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతే నవభారత నిర్మాణం జరుగుతోందని ప్రధాని ప్రకటించారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం… అనే మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని ప్రధాని మోడీ చెప్పారు.సమకాలిన రాజకీయ అంశాలు , శాంతి భద్రతలు, దేశ ఆర్థిక స్థితిగతులు తదితర వాటిపై ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశ ప్రజల మదిని దోచుకున్నారు.