టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన శ్రీలంక ఆల్ రౌండర్..!

Wanindu Hasaranga
Wanindu Hasaranga

శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ కి వీడ్కోలు పలుకుతూ, పరిమిత ఓవర్ల క్రికెట్ కెరీర్ ని మాత్రమే కొనసాగించడానికి వీలుగా చెబుతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 2020లో దక్షిణాఫ్రికాతో సుదీర్ఘ ఫార్మాట్ లోకి ఆరంగేట్రం చేసిన హసరంగ కేవలం నాలుగు టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. తన రిటైర్మెంట్ నిర్ణయానికి ఇప్పటికే శ్రీలంక బోర్డుకు తెలియజేశాడు.

అదేవిధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా హసరంగ రిటైర్మెంట్ కి ఆమోదం తెలిపింది. “టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకోవాలని శ్రీలంక ఆల్ రౌండర్ వనింధు హసరంగ నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్ ను పొడగించడానికి అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు హసరంగా శ్రీలంక తరపున 58 టీ20లు ,48 వన్డేలు ఆడాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ లో హసరంగ కీలకం అవుతాడని శ్రీలంక అభిమానులు కోరుకుంటున్నారు.