లాన్‌ టైఫూన్‌ గురి జపాన్‌ వైపు .. ఇక అల్లకల్లోలమే.. !

Lan typhoon towards Japan!
Lan typhoon towards Japan!

జపాన్‌ దేశాన్ని లాన్‌ టైఫూన్‌ టార్గెట్‌ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఇది టైఫూన్ల సీజన్. అయితే.. కుంభవృష్టిని వెంటేసుకుని,ప్రచండ గాలులు వచ్చే ఈ టైఫూన్లు తాము పయనించే మార్గంలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. తాజాగా ఈ సీజన్ లో ఏడో టైఫూన్ దూసుకువస్తోంది. ఇది జపాన్ కు గురిపెట్టింది.

గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతారణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోందని, జపాన్ పై మంగళవారం నుంచి దీని ప్రభావం ఉంటుందని జేఎంఏ తెలిపింది.

ప్రధానంగా క్యోటో,ఒసాకా నగరాల మీదుగా ఈ టైఫూన్ పయనించే అవకాశాలున్నట్టు తెలిపింది. పెనుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం, వరదలు వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేయాగ. తుపాను ప్రభావం చూపించే ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కూడా రద్దు చేశారు..