రెప్ సోల్ 150 బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ..

Dhoni rode a Rep Sol 150 bike
Dhoni rode a Rep Sol 150 bike

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి సరికొత్త విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే అతనికి ఉన్న క్రేజీ అలాంటిది మరీ.ముఖ్యంగా ఎం.ఎస్. ధోనికి బైకులు అంటే ఎంత ఇష్టమో దాదాపు అందరికీ తెలిసిందే. ఏదైనా కొత్త బైకులు మార్కెట్ లోకి వచ్చాయంటే దానిని కొని తన గ్యారేజీలో పెట్టాల్సిందే.

ఇప్పటికీ కూడా తన గ్యారేజీలో బైకులు చాలానే ఉన్నాయి. తాజాగా కెప్టెన్ కూల్ తన హోండా రెప్ సోల్ 150 బైకుపై రైడింగ్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే తన ఇంటి వద్దకు ధోని చేరుకున్నాడు. ఒక ఫొటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరారు. కానీ అప్పటికే ధోనీ తన రెప్ సోల్ 150 బైకుతో ఇంట్లోకి వెళ్లిపోయాడు.