బుర్జ్ ఖలీఫా పై తమ దేశ పతాకం ప్రదర్శించకపోవడంతో ఆందోళనకు దిగిన పాకిస్తానీలు..!

Pakistanis who are worried because their country's flag is not displayed on Burj Khalifa..!
Pakistanis who are worried because their country's flag is not displayed on Burj Khalifa..!

భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చిందని మనందరికీ తెలిసిన విషయమే .అలాగే ఆగస్టు 14న పాకిస్తాన్ మన నుంచి విడిపోయి స్వాతంత్రం వచ్చింది. ఈ సందర్భంగా నిన్న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనంలో తమ స్వాతంత్ర దినోత్సవానికి . . తమ జాతీయ జెండా యొక్క రంగులు వేయకపోవడంతో పాకిస్తాన్ జాతీయులు నిరసనకు దిగారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ప్రదర్శించింది. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రజలు తమ దేశం యొక్క వారసత్వాన్ని ఇలాగే గొప్పగా, గర్వంగా జరుపుకుంటూ ఐక్యతతో ఉంటారని.. తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోతో పాటు . రాబోయే భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రజలు మరిన్ని విజయాలను సంతోషాలను పొందాలని ఆకాంక్షిస్తూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.”అని పోస్ట్ చేశారు.

నిన్న ప్రపంచంలోని అత్యంత పెద్దదిగా ప్రసిద్ధి చెందిన బుర్జ్ ఖలీఫా దగ్గర పాకిస్తాన్ ప్రజలు నినాదాలు చేస్తూ, పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుమిగూడారు. అయితే వారు భవనంలో గడియారం 12 కొట్టగానే పాకిస్తాన్ జాతీయ జెండా కనిపించలేదని,కొన్ని క్షణాలలో పాకిస్తాన్ పౌరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయినారు…ఇక ఆ తర్వాత కాసేపటికి వారి జెండాను ప్రదర్శించడం జరిగింది.

దుబాయ్లో పాకిస్తాన్, భారత్ నుంచి వెళ్లిన ప్రవాసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుకే బుర్జ్ ఖలీఫా పై స్వాతంత్ర దినోత్సవం నాడు ఆ దేశ జెండాలను ప్రదర్శిస్తారు. బుర్జ్ ఖలీఫా పై ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా మన దేశ త్రివర్ణ పతాకం నిండుగా కనిపిస్తుంది.