ఒప్పో నుంచి స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌.. గేమింగ్ లవర్స్‌, కెమెరాకు ది బెస్ట్‌ ఫోన్‌..

Stunning smartphone from Oppo.. Gaming lovers, the best phone for camera..
Stunning smartphone from Oppo.. Gaming lovers, the best phone for camera..

ఇటీవల భారత్‌లో ఒప్పో రెనో 10 సిరీస్ 5జీ (OPPO Reno10 5G) ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ, ఒప్పో రెనో 10 5జీ, ఒప్పో రెనో 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ కలర్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఆండ్రాయిడ్ 13 ఆధారితంగా పని చేస్తుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. రూ. 32,999 ధరతో, ఈ ఫోన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, OPPO స్టోర్ మరియు మెయిన్‌లైన్ రిటైలర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

ఒప్పో రెనో 10 ప్రో 5జీ ధర

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.39,999గా నిర్ణయించారు.

ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5జీ ధర

ఇందులో కూడా ఒక్క వేరియంటే లాంచ్ అయింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది.