దిల్‌ రాజు ది గ్రేట్‌… నువ్వు సూపర్‌!!

Dil Raju says 3 New scenes added in Raja The Great Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు నిర్మాతల్లో తెలివైన నిర్మాత ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు దిల్‌రాజు. అవును ఈ విషయంలో ఎంత మాత్రం అవాస్తవం, అతిశయోక్తి లేదు. దిల్‌రాజు ఒక బడా నిర్మాత అయ్యి ఉండి కూడా తనకు నచ్చిన సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తూ లాభాలను దక్కించుకుంటూ ఉంటాడు. సినిమాను ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి, ఏ సినిమాకు ఎంత బడ్జెట్‌ పెట్టాలి, ఏ హీరోపై ఎంత బడ్జెట్‌ వర్కౌట్‌ అవుతుంది అనే విషయాు దిల్‌రాజుకు తెలిసినంతగా ఏ నిర్మాతకు తెలియదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Dil-Raju-New-movies

ఈ సంవత్సరంలో దిల్‌రాజు నిర్మించిన సినిమాలు, డిస్ట్రిబ్యూట్‌ చేసిన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రతి సినిమా కూడా దిల్‌రాజుకు లాభాలను తెచ్చి పెట్టాయి. తాజాగా దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం విడుదలైంది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పుడు మంచి పబ్లిసిటీ చేస్తే ప్రేక్షకులు మరింతగా సినిమాకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో దిల్‌రాజు మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేశాడు. సినిమాకు మంచి పబ్లిసిటీ చేసి రెండు వారాలు హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌ను వచ్చేలా ప్రమోట్‌ చేశాడు. తాజాగా మరో వారం పాటు సినిమాకు గట్టి కలెక్షన్స్‌ రాబట్టేలా ప్లాన్‌ వేశాడు.

Raja-The-Great-movie-poster

‘రాజా ది గ్రేట్‌’ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంది అంటూ టాక్‌ వచ్చింది. సినిమాకు మరో మూడు కామెడీ సీన్స్‌ను యాడ్‌ చేయబోతున్నట్లుగా దిల్‌రాజు అండ్‌ టీం ప్రకటించారు. ఈ శనివారం నుండి కొత్త సీన్స్‌ను థియేటర్లలో చూడవచ్చు అంటూ పోస్టర్‌ విడుదల చేశారు. ఇక మరింతగా నవ్వులు అంటూ చేసిన ప్రకటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తానికి దిల్‌రాజు వేసిన ఈ ప్లాన్‌తో మరో వారం రోజుల పాటు మంచి కలెక్షన్స్‌ వస్తాయని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రం దిల్‌రాజుకు దాదాపు 20 కోట్ల మేరకు లాభాలను తెచ్చి పెట్టినట్లుగా సమాచారం.