బుల్లి తెరపై ‘డీజే’ దుమ్ము లేపాడు

DJ movie Rated Top TRP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచిన ‘డీజే’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద టాప్‌ చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే. ‘ఖైదీ నెం.150’ చిత్రం కలెక్షన్స్‌కు చేరువగా డీజే వెళ్లాడు. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచిన ఈ చిత్రం తాజాగా బుల్లి తెరపై సందడి చేసింది. వెండి తెరపై డీజే రికార్డులు బద్దలు కొట్టగా బుల్లి తెరపై అంతకు మించి రికార్డు నమోదు అయ్యింది. బుల్లి తెరపై నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకుని మరెవ్వరికి సాధ్యం కాని రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు నాన్‌ బాహుబలి రికార్డు మహేష్‌బాబు ఖాతాలో ఉంది. అది కాస్త ఇప్పుడు బన్నీ దక్కించుకున్నాడు. 

బుల్లి తెరపై ‘డీజే’ కనీవిని ఎరుగని స్థాయిలో ఏకంగా 21.7 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ స్థాయిలో బాహుబలి మినహా తెలుగులో ఏ చిత్రం దక్కించుకోలేదు. ఈ స్థాయిలో రికార్డు స్థాయి టీఆర్పీని దక్కించుకున్న డీజేతో సదరు ఛానల్‌కు భారీ లాభాలు దక్కించుకుంది. బుల్లి తెరపై అల్లు అర్జున్‌ స్టామినా చూపించాడు. ఈ చిత్రానికి ముందు శ్రీమంతుడు చిత్రం 21.2 టీఆర్పీతో నాన్‌బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘డీజే’ చిత్రం మొదటి స్థానంలో నిలిచి శ్రీమంతుడు తర్వాత స్థానంలో నిలిచాడు. ఈ రెండు చిత్రాల తర్వాత జనతాగ్యారేజ్‌ చిత్రం 20.7 టీఆర్పీ రేటింగ్‌తో నాన్‌ బాహుబలి టాప్‌ 3 స్థానంలో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నాపేరు సూర్య’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.