తెలుగులో ట్రిపుల్ రోల్ చేసి హిట్ కొట్టిన హీరోలెవరో తెలుసా..?

tollywood actors
tollywood actor

సిల్వర్ స్క్రీన్ పైన హీరోలు సింగిల్ రోల్ లోఅలరించడం తరుచు చూస్తూనే ఉంటాము. కానీ అదే హీరోలు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కనుక చేస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువ ఉంటుంది . మరియు తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు అంటే ఫాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. చాలామంది హీరోలు సినిమాలలో ద్విపాత్రాభినయం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక ఏకంగా త్రిపాత్రాభినయం చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఆలా చేసిన హీరోలు ఎవరో చూద్దాం ….

1. జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ 2017లో వచ్చినటువంటి జై లవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం చేశారు. ఇందులో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది.కేవలం ఎన్టీఆర్ నటన కోసమే అభిమానులు థియేటర్ లకి క్యూ కట్టారు, బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా కొన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

2. సంపూర్ణేష్ బాబు
ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో సంపూర్ణేష్ బాబు. ఇతను నటించినటువంటి కొబ్బరి మట్ట సినిమాలో ఏకంగా మూడు పాత్రలలో నటించాడు. తాతగా, తండ్రిగా, కొడుకుగా త్రిపాత్రాభినయం చేశాడు

3. కళ్యాణ్ రామ్
హీరో కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో ఏకంగా మూడు పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఈ సినిమా అనుకున్న మేర హిట్ సాధించలేకపోయింది.

4. సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు నటించిన మామ మశ్చీంద్ర సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు పాత్రలలో నటించారు. సుధీర్ బాబు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు.