బిగ్ బాస్‌లో వినిపించే గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా..?

ఇప్పటికే ఆరు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్ బాస్ ఇప్పుడు ఏడో సీజన్ తో ప్రజలను ఆకట్టుకుంటుంది. అయితే ఎప్పుడు బిగ్ బాస్ మాట వినడమే కానీ ఆ గొంతు ఎవరిదీ అనేది మాత్రం ఎవరికీ తెలియదు. హౌస్ లో ఉన్న వారిని కంట్రోల్ చేసే ఆ వాయిస్ ఎవరిదీ అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు . హౌస్ లోకి చాలా మంది వస్తుంటారు. అలాంటి వారిని కంట్రోల్ చేయాలంటే ఆ వాయిస్ చాలా పెద్దగా ఉండాలి. మాట వింటేనే భయం రావాలి.. అచ్చం అలానే ఉంటుంది బిగ్ బాస్ వాయిస్ కూడా . ఇంతకు బిగ్ బాస్ కు గాత్రదానం చేస్తున్న వ్యక్తి ఎవరంటే..?

బిగ్ బాస్ గేమ్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా మనం మనం చెప్పాల్సిన అవసరం లేదు పలు భాషల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి ఆదరణ కూడా అందుకుంది.

బిగ్ బాస్ గేమ్ షోకి వాయిస్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ పేరు రాధా కృష్ణ. రోజు మనం వినే బిగ్ బాస్ వాయిస్ ఈయనదే అంట . రాధా కృష్ణ ఓ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన పలు సీరియల్స్, సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. సీజన్ వన్ నుంచి తన వాయిస్ తో హౌస్ లోకి వచ్చిన వారిని కంట్రోల్ చేస్తూ రకరకాల టాస్క్ లు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు రాధాకృష్ణ గారు .

ఇక బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 2 వరకు ఒకలా వాయిస్ ఇచ్చిన రాధాకృష్ణ ఆతర్వాత నుంచి మాడ్యులేషన్ మార్చారు. హౌస్ట్ లను సైతం తన గంభీరమైన వాయిస్ తో భయపెడుతూ ఉంటారు రాధాకృష్ణ. ఇక బిగ్ బాస్ సీజన్ సెవన్ 7 లో ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ తో రెండో వారం నామినేషన్ పూర్తయ్యింది. ఈ సారి నామినేషన్ లో ఏకంగా 9 మంది ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, రతిక, టేస్టీ తేజా, అమర్ దీప్ చౌదరి, షకీలా, గౌతమ్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు.