టాలీవుడ్ లో విషాదం, దర్శకురాలు జయ మృతి

సినీ నటుడు నంద‌మూరి హ‌రికృష్ణ క‌న్నుమూసి రెండు రోజులు కూడా కాక‌ముందే ఇండ‌స్ట్రీకి మ‌రో షాకింగ్ వార్త. ద‌ర్శ‌కురాలు బి జ‌య అనారోగ్యంతో నిన్న రాత్రి క‌న్నుమూసారు. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా అనారోగ్యం వలన హైదరాబాద్ లోని కేర్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు. తెలుగు ఇండ‌స్ట్రీలో లీడింగ్ పిఆర్ఓగా ఉన్న బిఎ రాజు భార్య ఈమె. “చంటిగాడు” సినిమాతో దర్శకురాలిగా పరిచయమయిన ఆమె “గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు”, “ప్రేమికులు”, “ల‌వ్లీ” లాంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. ఆమె తెర‌కెక్కించిన చివ‌రి సినిమా “వైశాఖం” 2017లో ఈ చిత్రం విడుద‌లైంది. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న అతికొద్ది మంది లేడీ డైరెక్ట‌ర్స్ లో జ‌య కూడా ఒక‌రు.