పొలిటికల్ పార్టీ పెట్టిన స్టార్ హీరో !

Vishal Launches New Political Party

తమిళ రాజకీయం భలే రంజుగా మారుతోంది, ఇప్పటికే అమ్మ మరణంతో రెండు ముక్కలైన అన్నా డీఎంకే ఒక పక్క, తండ్రి మరణంతో అధ్యక్ష్యుడయిన స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఒకపక్క, కమల్ హాసన్ ఒక పక్క, రజనీ కాంత్ పార్టీ మరో పక్క ఉండడంతో తనకు ఎదో ఒక అవకాసం రాకపోతుందా అనుకున్నాడేమో, తెలుగు మూలాలున్న తమిళ హీరో విశాల్ తానూ ఒక రాజకీయ పార్టీ పెట్టేశాడు. ఇందుకు ‘ఇరుబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) సినిమా వంద రోజుల వేడుకను వేదికగా చేసుకున్నాడు తెలివైన ఆ హీరో. పార్టీ పేరుతో పాటు పలు నినాదాలతో కూడిన జెండాలను కూడా ఆవిష్కరించి అభిమానులకు డబల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మక్కల్ నాలా ఐయాకమ్’ (ప్రజా సంక్షేమం) పార్టీ పేరుగా ప్రకటించిన విశాల్ తమిళనాడులోని తన అభిమాన సంఘాలన్నింటినీ ఐక్యం చేసి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు20తెలిపాడు.

Vishal-Launches-New-Politic

జెండాపై ‘అని సెర్వొం’ (కలిసికట్టుగా తరలిరండి), ‘అనబై వితిపోం’ (ప్రేమను పెంపొందిద్దాం) అని నినాదాలతో ఆలోచింపచేసిన విశాల్ ఒక వైపు మదర్ థెరిసా, మరో వైపు ఏపీజే అబ్దుల్ కలాం ఫొటోలు కూడా వాడి ఇది ప్రజల సేవ కోసమే అని పరోక్షంగా సందేశం ఇచ్చేశాడు. ఇక ట్యాగ్ లైన్ల లాగా ‘వివేగం’ (దూరదృష్టి), ‘వితియశం’ (వైవిధ్యం), ‘విద ముయర్చీ’ (దృఢ నిశ్చయం) అనే క్యాప్సన్లు ఎటూ ఉండనే ఉన్నాయనుకోండి. దీంతో మొత్తానికి తమిళ స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎస్ఎస్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్, టి.రాజేంద్రన్, కె.భాగ్యరాజ్, విజయ్‌కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ సరసన విశాల్ కూడా చేరిపోయాడు. గెలుస్తామా లేదా, అసలు పోటీ చేస్తామా లేదా అనేది పక్కన పెడితే స్టార్లు కూడా రాజకీయల్లోకి రావడం ప్రజలకు మాత్రం శుభ పరిణామమని చెప్పొచ్చు.

VISHAL