‘ఆర్‌ఎక్స్‌100’ 50 డేస్‌ రికార్డ్‌

rx 100 movie 50 days record

కార్తికేయ, పాయల్‌ రాజ్‌పూత్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న చిత్రం ‘ఆర్‌ఎక్స్‌100’. ఈ చిత్రం కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్‌తో రూపొందడం జరిగింది. విభిన్నమైన ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంను ప్రేక్షకులు విపరీతంగా ఆధరించారు. ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్‌ ఈచిత్రానికి ఫిదా అయ్యారు. దాంతో బారీ ఎత్తున ఈ చిత్రం వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపుగా 13 కోట్ల షేర్‌ను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఒక చిన్న బడ్జెట్‌ చిత్రం, స్టార్స్‌ ఎవరు లేని చిత్రం ఇంతగా వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. నిర్మాతకు దాదాపుగా నాలుగు అయిదు రెట్ల లాభాలు దక్కాయి.

rx100

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం తాజాగా 50 డేస్‌ను పూర్తి చేసుకుంది. ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు కూడా 50 రోజులు ఆడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఈ చిత్రం 50 రోజులను ఏకంగా 26 థియేటర్లలో పూర్తి చేసుకోవడం సంచలనంగా మారింది. నైజాం ఏరియాలో ఈ చిత్రం 6 థియేటర్లలో, సీడెడ్‌లో 13 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శింపబడటం జరుగుతుంది. వెస్ట్‌గోదావరిలో ఏకంగా నాలుగు థియేటర్లలో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో హీరో కార్తికేయ, హీరోయిన్‌ పాయల్‌, దర్శకుడు అజయ్‌ భూపతిలు ఓవర్‌ నైట్‌ స్టార్స్‌ అయ్యారు.

rx100