టీఆర్పీలోను మహానటి రికార్డు

Highest trp rating for mahanati movie

తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పర్చుకుని మహానటిగా గుర్తింపు దక్కించుకున్న అనాటి తార సావిత్రి. ఆమె బయోపిక్‌ తెలుగులో ‘మహానటి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఒక చిన్న చిత్రంగా తెరకెక్కిన మహానటి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయి వసూళ్లను సాధించి నిర్మాతలకు కాసుల పంట పండిచ్చిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో వసూళ్లు సాధించిన మహానటి చిత్రంను స్టార్‌ మా వారు భారీ రేటు పెట్టి శాటిలైట్‌ రైట్స్‌ కొనుగోలు చేయడం జరిగింది. మహానటి వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా భారీ విజయాన్ని నమోదు చేసి, స్టార్‌ మా వారికి మంచి లాభాలను తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తోంది.

mahanati

ఇటీవలే మహానటి చిత్రం మాటీవీలో ప్రసారం అయ్యింది. ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్‌ వస్తుందని స్టార్‌ మా వారు భావించారు. కాని స్టార్‌ మా వారు ఊహించని విధంగా అత్యధికంగా 20.16 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకోవడం జరిగింది. ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ఇంతటి స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకోవడం సౌత్‌లో ఇదే ప్రథమం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో సావిత్రిగా కనిపించగా, జెమిని గణేషన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ కనిపించారు. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రంకు సుమంత్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాడు. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన మహానటి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకోవడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

mahanati