తెలుగుకు దూరంపై కీర్తి సురేష్‌ క్లారిటీ

Keerthi Suresh Still Not Accepted Any Telugu Movies

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ ఆ తర్వాత నానితో నేను లోకల్‌ చిత్రంలో నటించింది. తెలుగు కంటే తమిళంపై ఎక్కువ దృష్టి పెట్టిన ఈ హీరోయిన్‌ ‘మహానటి’ చిత్రంతో తెలుగులో భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకుంది. తెలుగులో ఈమె సాధించిన విజయంతో ఆమెకు టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూంది. మహానటి విడుదలై ఆరు నెలలు గడిచి పోయినా కూడా తెలుగులో ఒక్కటి అంటే ఒక్కటి కూడా సైన్‌ చేయలేదు. తమిళంలో మాత్రం వరుసగా చిత్రాలు చేసుకుంటూ వస్తుంది. ఆ విషయంపై తాజాగా కీర్తి సురేష్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినది

keerthi-suresh

తెలుగులో ‘మహానటి’ చిత్రంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ స్థాయిలోనే నా నుండి ప్రేక్షకులు పాత్రలు ఆశిస్తారు. అందుకే అటువంటి స్థాయికి తగ్గట్లుగా సినిమాు లేదా పాత్రలు వస్తే చేస్తాను తప్ప అప్పటి వరకు తెలుగులో నటించను అంటూ చెప్పేసింది. తమిళం విషయం పక్కన పెడితే తెలుగులో మాత్రం ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమె మళ్లీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ ప్రేక్షకులు అసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో ఈమెను నటింపజేసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈమె పందెంకోడి 2 మరియు సర్కార్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిది. తెలుగులో కూడా అవి డబ్‌ అయ్యాయి. కాని డైరెక్ట్‌ సినిమాతో మాత్రం కీర్తి తెలుగులోకి రావడం లేదు.

keerthi-suresh-movies