ఆత్మహత్య కాదు హత్యే అంటున్న సుశాంత్ సింగ్ మామ

ఆత్మహత్య కాదు హత్యే అంటున్న సుశాంత్ సింగ్ మామ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య పలువురు ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 34 ఏళ్ల వయసులో అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. అయితే ముంబై లో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్, తన ఆత్మహత్య పై అనుమానాలు ఉన్నాయి అని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.అయితే అతని మరణం పై సుశాంత్ మామ పలు ఆరోపణలు చేశారు. అతని మృతి వెనుక ఏదో కుట్ర ఉంది అని, అతనిది ముమ్మాటికీ హత్యే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అని సుశాంత్ మామ తెలుపుతూ న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అయితే సుశాంత్ ఆత్మహత్య విషయం పై పోలీసులు ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఆరు నెలలుగా సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నారు అని, దానికొరకు చికిత్స పొందుతున్నారు అని తెలిపారు.అయితే సుశాంత్ ఆత్మహత్య విషయం అతని ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి సుశాంత్ మృత దేహాన్ని స్వాధీన చేసుకున్నారు. అయితే సుశాంత్ మరణించిన రోజున కొంతమంది స్నేహితులు అతడి ఇంట్లో ఉన్నట్లుగా తెలిపారు.